ఈనెల 27న వరంగల్లో జరిగే రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులంతా దండై కదలి రావాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం చంపాపేట గాంధీ బొమ్మ చౌరస్తా , కర్మన్ ఘాట్, బైరమల్గూడలో బీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జెండాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై జెండాలను ఆవిష్కరించారు.
– చంపాపేట, ఏప్రిల్ 23
వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఏఎస్ రావు నగర్ డివిజన్ జమ్మిగడ్డలో స్థానిక కార్పొరేటర్ సింగర్ రెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కాసం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– కాప్రా,ఏప్రిల్ 23