గోల్నాక, జనవరి 29 : నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపడుతున్నామన్నారు. శనివారం గోల్నాక డివిజన్ న్యూగంగానర్లో దాదాపు రూ. 6 లక్షల అంచనా వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైప్‌లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతా ల్లో డ్రైనేజీ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇందుకు సంబంధించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీ పైప్లైన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన నేమ్ బోర్డును ఆవిష్కరించారు. బస్తీలో పలు శాఖల అధికారులతో కలసి ఆయన పాదయాత్ర నిర్వహించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు రోహిత్, మల్లేశ్, జీహెచ్ఎంసీ అధికారి మనోహర్, టీఆర్ఎస్ నాయకులు కె. శ్రీనివాస్, ఆర్కే బాబు, మధు, లింగంగౌడ్, నర్సింగ్‌యాదవ్, శ్రీనివాస్, దేవి, ప్రభాకర్, అంజయ్యచారి, సురేశ్‌గౌడ్, యూసుఫ్. వెంకటేశ్, మల్లేశ్‌గౌడ్, పూర్ణచందర్, శివశంకర్ పాల్గొన్నారు.