సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): నగర శివారులో మరో కొత్త లేఅవుట్ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేయనుంది. అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని తట్టి అన్నారంలో 35 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ ప్రమాణాలకు అనుగుణంగా లేఅవుట్ను అభివృద్ధి చేసే పనులను ప్రారంభించారు. రాజీవ్ స్వగృహకు చెందిన స్థలాన్ని లేఅవుట్గా అభివృద్ధి చేసి, ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు.
తట్టి అన్నారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 73లోని 35 ఎకరాల చుట్టూ రక్షణ గోడను ఏర్పాటు చేయడంతో పాటు ప్లాట్లు, రోడ్లకు మార్కింగ్ చేయనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నెల రోజుల వ్యవధిలో ఈ పనులను పూర్తి చేసి, ఆన్లైన్ వేలం ద్వారా ప్లాట్లను విక్రయిస్తామన్నారు. హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా విశాలమైన రహదారులు, ఇతర మౌలిక వసతులను లేఅవుట్లో కల్పించనున్నామని అధికారులు పేర్కొన్నారు.