
మెహిదీపట్నం, జనవరి 10 : ప్రజలకు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధిని అందిస్తున్నామని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. సోమవారం టోలిచౌకిలో నానల్నగర్ కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్, ఎంఐఎం కార్పొరేటర్ల ప్రతినిధులు మహ్మద్ హరూన్ ఫర్హాన్, బద్రుద్దీన్లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల రూ.25 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రారంభించారని, ఈ పనులను త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు.
కార్వాన్ నియోజకవర్గం టోలిచౌకి డివిజన్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ వెనక రిసాలబజార్లో సోమవారం తెల్లవారుజామున వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. కులీకుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ సంస్థ నిధులతో జరుగుతున్న ఈ పనులను ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి మహ్మద్ హరూన్ ఫర్హాన్ పరిశీలించారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
గుడిమల్కాపూర్ డివిజన్లోని మోహిని ఫంక్షన్ హాల్ వద్ద సీసీ రోడ్డు పనులు కార్పొరేటర్ దేవర కరుణాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అన్నూ యాదవ్, డిజ్వర్ సింగ్, సుధాకర్ యాదవ్, శ్రీకాంత్ సాగర్, సందేశ్యాదవ్ పాల్గొన్నారు.