మేడ్చల్‌కలెక్టరేట్,నవంబర్8: అన్ని రంగాల్లో రాష్ట్ర వేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు ఈశ్వరయ్య కాలనీలో, 11వ వార్డు మారుతీ నగర్లో,15వ వార్డు సాయి శ్రీనివాస్ నగర్, నాసిన్ చెరువు కట్ట వద్ద రూ. 45 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు కొమటికుంట చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచేలా కృష చేశారని అన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధిపై సీఎం కేసీ ఆర్ చూపిన చొరవతో మున్సిపాలిటీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయన్నారు. త్వరలోనే నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో లింక్ రోడ్ల విస్తరణ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు వసుపతి ప్రణీత, కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్లు నరేందర్ రెడ్డి, మల్లేశ్‌యాదవ్, కమిషనర్ స్వామి, కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యులు సాయినాథ్‌గౌడ్, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిగౌడ్, కౌన్సిలర్లు సరిత, శ్రీలత రామారావు, వెంకటరమణ, నర్సింహారెడ్డి, రమే శ్‌గౌడ్, శ్రీహరిగౌడ్,పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి రాములు, ఇరిగేషన్ ఏఈ ప్రశాంత్, నాయకులు శ్రీధర్, వెంకట్‌రెడ్డి,ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ రెడ్డి, నరహరి రెడ్డి, కార్తీక్ గౌడ్, ఖాజామియా, రా మారావు, శ్రీకాంత్ గౌడ్, మణికంఠ ముదిరాజ్, రాజేశ్వ రి, సుజాత, కో-అప్షన్ సభ్యులు,అధికారులు ఉన్నారు.