బన్సీలాల్‌పేట్, సెప్టెంబర్ 6 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు ఎం.సురేశ్ (అంబులెన్స్) ఆధ్వర్యంలో బన్సీలాల్‌పేట డివిజన్, పద్మారావునగర్‌లోని హమాలీ బస్తీకి చెందిన 70 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి తలసాని వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతికి చెందిన ప్రజలకు మేలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. నగరంలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, ఉచితంగా తాగునీరు అందించడం లాంటివి అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. హమాలీబస్తీలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి నిధులను కేటాయించామన్నారు. ప్రజలు ముందుకొస్తే ఇండ్ల నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి తెలిపారు. యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బన్సీలాల్‌పేట కార్పొరేటర్ కె.హేమలత, డివిజన్ బీఆర్ఎస్ ఇన్చార్జి జి.పవన్‌కుమార్ గౌడ్, నాయకులు ఏసూరి మహేశ్, వెంకటేశన్ రాజు, కె.లక్ష్మీపతి, శ్రీకాంత్‌రెడ్డి, వెంకట్, శివ, వినోద్, సన్ని, శ్రీకాంత్, జిలానీ తదితరులు పాల్గొన్నారు. బాలుడి మృతికి బాధ్యులైన వారిపై..కఠిన చర్యలు తీసుకుంటాం