అంబర్‌పేట : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలన సాగిస్తున్నదని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ శ్రీనివాసనగర్ కాలనీలో రూ.22 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబర్‌పేట నియోజకవర్గంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ అనేక అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, వాటర్‌వర్క్ మేనేజర్ మజీద్, టీఆర్ఎస్ పార్టీ బాగ్‌అంబర్‌పేట డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.
నల్లకుంటలో….
నల్లకుంట డివిజన్లోని యాక్సెస్ బ్యాంకు లేన్‌లో రూ.6 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ వై.అమృతతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని బస్తీల్లో ఇతర మరమ్మతులు, నిర్మాణ పనులు పూర్తయిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే జనరల్ బడ్జెట్ నుండి అవసరమైన నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే నాణ్యతలోపం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఈ సువర్ణ, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్, వాటర్‌వర్క్ మేనేజర్ రోహిత్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.