అడ్డగుట్ట, నవంబర్ 10 : గడిచిన పదేళ్లకాలంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధ్ది చేశామని డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ సికింద్రాబాద్ నియోజకవర్గ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. శుక్రవారం మెట్టుగూడ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ రాసూరి సునీతతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని దూద్‌బావి, చింతబావి, టీఆర్‌నగర్, పార్థిబస్తీ, హమాలీబస్తీ, 8 నెంబర్ గల్లీ, చిలకలగూడతో పాటు తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా కలిసి ఓటును అభ్యర్థించారు.
పద్మారావు పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలను పలికారు. ఈ సందర్భంగా కళాకారుల నృత్యాలు, బతుకమ్మ ఆటపాటలతో పద్మారావుకు మహిళలు, ఆయా బస్తీల ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 50 ఏండ్లల్లో గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని అతి తక్కువకాలంలో చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో వందలకోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను చేపట్టామని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ప్రచారంలో భాగంగా పద్మారావు ఆయా బస్తీలకు చెందిన మహిళలు, యువకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాసూరి సునీత, సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి, శైలజ, బీఆర్ఎస్ నగర సంయుక్త కార్యదర్శి గుండవేణి రాజేష్ గౌడ్(పెద్దన్న), నేతలు కృష్ణ, వంజరి సతీష్‌కుమార్, చంద్రశేఖర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
పజ్జన్నను గెలిపించుకుంటామని ప్రజలే స్వచ్ఛందం గా ముందుకొచ్చి మద్దతు తెలుపుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నగర సంయుక్త కార్యదర్శి గుండవేణి రాజేష్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి బస్తీల్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించి కారు గుర్తుకు ఓటేసి పద్మారావు గౌడ్‌ను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు కృష్ణ, మోహన్, జలేందర్ రెడ్డి, ప్రకాష్, కోనేటి శ్వేత శ్రీ, సరోజ, గోవిందన్, శంకర్, ఇంద్రన్న తదితరులు పాల్గొన్నారు.