సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ అన్నారు. గ్రేటర్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆబ్కారీ నేరాలపై నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డీసీ దశరథ్ మాట్లాడుతూ.. జిల్లాలో డీటీఎఫ్, ఎక్సైజ్ బృందాలు డ్రగ్స్‌పై మరింత నిఘా పెంచాలని సూచించారు.
గడిచిన సెప్టెంబర్ మాసంలో అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉన్నా.. డ్రగ్స్, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై మరింత దృష్టి పెట్టాలని ఆదేశించారు. గత నెలలో నాటు సారా కేంద్రాలపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి 56 కేసులు నమోదు చేశామని, 53 మంది నిందితులను అరెస్టు చేసి, 111లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నాటు సారాను పూర్తిగా నిర్మూలించే దిశగా సిబ్బంది, అధికారులు మరింత కృషి చేయాలన్నారు.
నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌కు సంబంధించి మూడు కేసులు నమోదు చేసి, ఏడుగురిని అరెస్టు చేసి, వారి నుంచి 81 లీటర్ల నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఈ మధ్యకాలంలో కొన్ని ముఠాలు నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నాయని, దీనికి తోడు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం నగరానికి సరఫరా అవుతున్నదన్నారు. వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ముఖ్యంగా విమానాశ్రయం వద్ద పటిష్ట నిఘా పెట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్, శంషాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సరూర్‌నగర్, వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కృష్ణప్రియ, ఎస్కె. ఫయాజుద్దీన్, కె.నవీన్‌కుమార్, ఎస్.ఉజ్వలారెడ్డి, కె.విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.