కవాడిగూడ, ఏప్రిల్ 8: బస్తర్ ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధం ఆదివాసి జాతి అంతానికి తప్పితే వారి సంక్షేమానికి ఎంతమాత్రం కాదని పలువురు వక్తలు అన్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఎత్తివేసి ఆదివాసుల్ని రక్షించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మంగళవారం ప్రజాధర్నా నిర్వహించారు.
సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ప్రజాధర్నా కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు రమామెల్కొటే, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జే.వి.చలపతిరావు, టీజేఎస్ నాయకులు ఆచార్య కోదండరాం, ఆప్ కన్వీనర్ డాక్టర్ సుధాకర్, సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, సీపీఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ నాయకురాలు కే రమా, ఎంసీపీఐ (యు) నాయకులు మట్టయ్య, లిబరేషన్ నాయకులు రమేష్‌రాజా, రెడ్‌ఫ్లాగ్ నాయకులు రాజేశ్, అరుణోదయ విమల, ఆచార్య ఖాసీం, ఆచార్య వినాయకరెడ్డి, కన్నగంటి రవి, కె.సజయ, మురళీకృష్ణ, వి.సంధ్య, కె.గోవర్ధన్, అంబటి నాగయ్య, కవి విశ్వనాథుల పష్పగిరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆచార్యులు రమా మెల్కొటే మాట్లాడుతూ.. చత్తీస్‌గఢ్‌లో ఆదివాసీలపై కొనసాగుతున్న హత్యాకాండను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపివేయాలన్నారు. జే.వీ.చలపతిరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలన్నారు.