హైదరాబాద్: బతుకమ్మ, నవరాత్రుల సందర్భంగా పూల మారెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పూలను కొనుగోలు చేసేందుకు జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో మారెట్లన్నీ రద్దీగా మారాయి. గత వారం రోజుల కిందట తకువ ధర పలికిన పూలకు ఇప్పుడు రెకలు వచ్చాయి. అతిపెద్ద పూల మార్కెట్ గుడిమలాపూర్, ఎర్రగడ్డ, గడ్డిఅన్నారం, మొండామార్కెట్, బోయినపల్లి తదితర మార్కెట్లు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి.
గురువారం సద్దుల బతుకమ్మతో పాటు నవరాత్రుల సందర్భంగా పెద్దఎత్తున జనాలు మారెట్లకు తరలివెళ్లి పూలు కొనుగోలు చేస్తున్నారు. పూలకు డిమాండ్ పెరగడంతో ధరలకు రెకలొచ్చాయి. వారం కిందట గరిష్ఠంగా రూ.30 పలికిన ధరలు అమాంతం రూ.100 నుంచి రూ.200లకు పెరిగాయి. సాధారణంగా పెళ్లిళ్లకు సంబంధించిన ఆర్డర్లు తరచూ ఉంటాయని, పండుగ కావడంతో జనాలు మారెట్ పెద్ద సంఖ్యలో వచ్చేసరికి పూలకు డిమాండ్ వ్యాపారులు చెబుతున్నారు.
కాగా, హైదరాబాద్ హోల్సేల్ పూల మారెట్ టాలకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పూలు దిగుమతి అవుతుంటాయి. గుడిమలాపూర్ మారెట్ దేశవాళీ హైబ్రిడ్ చెందిన వివిధ రకాల పూలు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటాయి. ఇతర రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నందు వల్లే పూల దిగుమతి తగ్గిందని, దాని కారణంగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.