Suicide | కాచిగూడ, జూలై 13 : అనుమానాస్పద స్థితిలో డెలివరీ బాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ డి.సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ కుమారుడు శివకృష్ణ(20) వృత్తిరీత్యా జుమాటలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ బర్కత్‌పురలోని భూమన లైన్లో ఐదు మంది స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు. శనివారం అర్ధరాత్రి శివకృష్ణ అనుమానాస్పద స్థితిలో బెడ్ షీట్‌తో ఉక్కుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. తల్లి కల్పన ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుభాష్ తెలిపారు.