బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నం. 5లోని దేవరకొండ బస్తీలో బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనుల్లో జాప్యం వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న కష్టాలపై ‘నమస్తే తెలంగాణ’ ‘దేవరకొండ.. దీనగాథ’ పేరుతో ప్రచురించిన కథనంపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. సోమవారం జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్ ఎస్ఈ విజయ్‌కుమార్‌తో పాటు అధికారులు దేవరకొండ బస్తీలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు.
రెండునెలలుగా నత్తనడకన సాగుతున్న పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సెంట్రింగ్ కార్మికులు అర్థాంతరంగా పనులు ఆపేసి వెళ్లిపోవడంతో పనులు నిలిచిపోయాయని, యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తామని ఎస్ఈ విజయ్‌కుమార్ తెలిపారు. ప్రధాన రోడ్డుపై మురుగునీరు ప్రవహించకుండా నాలాను ఆనుకొని వెళ్లేలా నాలుగురోజుల్లో ఏర్పాట్లు చేస్తామని, ఆలోగా ఒకవైపు కాంక్రీట్ వాల్ పూర్తిచేయిస్తామన్నారు.