Bathukamma | కాచిగూడ, అక్టోబర్ 6: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని అవంతి విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ప్రియాంక అన్నారు. బర్కత్పుర అవంతి డిగ్రీ, పీజీ కళాశాలల ఆధ్వర్యంలో అట్ల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు.
తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో సహజ సిద్ధంగా తయారు చేసిన బతుకమ్మ వేడుకలను విద్యార్థినులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అవంతి విద్యా సంస్థల హెచ్చార్ డాక్టర్ వై.జయప్రద, సిబ్బంది పాల్గొన్నారు.