షేక్‌పేట్, అక్టోబర్ 15:తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కోరారు. బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్లో మైనార్టీ నాయకులను మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డిలు కలిసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, వక్ఫ్ బోర్డు మాజీ సభ్యులు వహీద్, పార్టీ కార్యదర్శి మహ్మద్ షకీల్ తదితరులు పాల్గొన్నారు.
బూత్ ఇన్చార్జులకు ఓటరు లిస్టుల అందజేత
షేక్‌పేట్ వినాయకనగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, నాయకులు జైసింహ తదితరులు బూత్‌ల ఇన్‌చార్జీలకు ఓటరు లిస్టులను అందించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ గెలుపుకు తీవ్రంగా కృషి చేయాలన్నారు.
బీజేఆర్‌నగర్‌లో ఇంటింటి ప్రచారం
షేక్‌పేట్ డివిజన్ బీజేఆర్ నగర్లో బుధవారం ఉదయం ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీనాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.