తెలంగాణ ఉద్యమ చరిత్రను మరో మలుపు తిప్పిన్రు కేసీఆర్. ఆయన నాడు (నవంబర్ 29, 2009) చేపట్టిన దీక్ష కోట్లాది మందికి స్ఫూర్తి. అనంతరం, తెలంగాణ ఏర్పాటు దిశగా సాగిన పయనం ఏ తెలంగాణ వాది మరిచిపోలేనిది. ఆ మలుపు యాదిలో బీఆర్ఎస్ పార్టీ నగరంలో పెద్ద ఎత్తున నగరంలో దీక్షా దివస్ను చేపట్టింది. ఈ నేపథ్యంలో నగరంలోని బీఆర్ఎస్ భవన్లో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి.
ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న కేసీఆర్ పట్టుదల, కార్యదక్షతపై ప్రతి కార్యకర్త జయజయ ధ్వానాలతో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. బీఆర్ఎస్ పార్టీ పోరాట పటిమ, కేసీఆర్ దీక్ష బూనిన విధాన్ని ఒకసారి మననం చేసుకున్నారు.
నగరంలో పలు చోట్ల బైక్, కార్ల ర్యాలీలు చేపట్టి పార్టీ నేతలు బీఆర్ఎస్ భవన్ వరకు వేలాదిగా తరలివచ్చారు. ఐదారు కిలో మీటర్ల మేర వాహనాల ర్యాలీలను మాజీ మంత్రి తలసాని, ఎమ్మెల్యే మాగంటి తదితర నేతలు చేపట్టారు. తెలంగాణ కలను సాకారం చేసిన ధీరోదాత్తుడు.. కేసీఆర్, తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత అంటూ పలువురు నాయకులను కార్యకర్తల దాకా పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.