సిటీబ్యూరో, మార్చి 2, నమస్తే తెలంగాణ : అర్హత లేకుండా క్లీనిక్‌లో అనధికారికంగా వైద్యం నిర్వహిస్తున్న నకిలీ వైద్యులపై డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం, చిక్కడపల్లి గ్రామంలో కుర్మ మల్లేష అర్హత లేకుండా తన క్లినిక్‌లో అనధికారికంగా వైద్యం నిర్వహిస్తున్నండగా డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా నిల్వ ఉంచిన రూ.20వేల విలువ చేసే 34 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మందుల్లో సెఫొపెరజోన్, ఓఫ్లాక్ససిన్, సిప్రోఫ్లాక్ససిన్, అమోక్సిసిలిన్ వంటి యాంటీబయోటిక్స్ ఉండటం గమనార్హం. అనర్హులైన వ్యక్తుల చేతుల్లో యాంటీబయోటిక్స్ విక్రయించడం ప్రజా ఆరోగ్యానికి హానికరం అని అధికారులు హెచ్చరించారు. డ్రగ్స్ మరియు కాస్మోటిక్స్ చట్టం ప్రకారం లైసెన్స్ లేకుండా మందుల నిల్వ, అమ్మకం చేయడం నేరమని, దీని ప్రకారం నేరస్థులకు గరిష్ఠంగా 5 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని, దర్యాప్తును ముమ్మరం చేస్తున్నట్లు దాడి నిర్వహించిన నిజామాబాద్ రూరల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీలత
తెలిపారు.