హైదరాబాద్ : తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ(Rajiv Arogyashri) కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodara Rajanarasimha) అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సిబ్బంది వేతనాలు, ఆరోగ్య మిత్ర డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ స్ట్రెంత్ పెంపుదల పై తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య, అసోసి యేషన్ ప్రధాన కార్యదర్శి కుమార్, ఇతర జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు, రాష్ట్ర ముఖ్య నాయకులు తాళ్ల నాగేష్ గౌడ్, తుమ్మల రాజు, వజ్ర, నాగరాజు విష్ణు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.