బన్సీలాల్‌పేట్, సెప్టెంబర్ 3: పేదలకు మెరుగైన వైద్య సేవలందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామ ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో ఆయన అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు. ముం దుగా సూపరింటెండెంట్ చాంబర్లో అధికారులతో పలు అంశాలపై చర్చించారు. బయటి రోగుల విభాగం, ఐసీ యూ, క్యాజువాలిటి, టీఎంటీ, జనరల్ మెడిసిన్ వార్డులను ఆయన సం దర్శించి, పలువురు రోగులతో మా ట్లాడారు. రోగి సహాయకులు కింద కూర్చుని ఉండటాన్ని గమనించి, వా రి కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం, మీడియాతో మాట్లాడుతూ గాంధీ దవాఖానలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. చాలా కాలంగా పెం డింగ్‌లో సంతాన సాఫల్య కేంద్రంలో ఐవీఎఫ్ సేవలను త్వరలో ప్రారంభిస్తామని, అందులో ఎంబ్రియోలాజిస్ట్ను కూడా నియమిస్తామని అన్నా రు. వైద్య విద్యార్థుల అభ్యర్థన మేర కు నూతన హాస్టల్ భవనాల నిర్మా ణం కోసం రూ.79 కోట్లను ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వ రలో తాను ఇక్కడికి వచ్చి నిర్మాణ ప నులను ప్రారంభిస్తానన్నారు.
సూపర్ స్పెషాలిటి రెండో యూనిట్‌ను ఏర్పా టు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు. ఈ పర్యటనలో వై ద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టీనా చోంగ్తూ, డీఎంఈ డాక్టర్ వా ణి, దవాఖాన సూపరింటెండెంట్ డా.సీహెచ్ ఎన్ రాజకుమారి, డిప్యూ టీ సూపరింటెండెంట్లు డా. సుబోధ్ కుమార్, డా. సునీల్ కుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. కె.ఇందిర, వైస్ ప్రిన్సిపాల్ డా. వాల్యా, డా. రవిశేఖర్‌రావు, ఆర్ఎంఓ డా.శేషాద్రి, ప లు విభాగాల హెచ్ఓడీలు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఇంజనీర్లు పాల్గొన్నారు.
జిల్లా దవాఖానలో పర్యటన
సుల్తాన్‌బజార్: సీజనల్ వ్యాధు లు ప్రబలుతున్న నేపథ్యంలో రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అం దించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పే ర్కొన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని కింగ్ కోఠి జిల్లా దవాఖానాను ఆకస్మికంగా పర్యవేక్షించారు. తెలంగాణ వైద్య విధాన పరిష త్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమా ర్, దవాఖాన సూపరింటెండెంట్ డా క్టర్ రాజేంద్రనాథ్‌తో కలిసి దవాఖానాను పర్యవేక్షించారు.