సిటీబ్యూరో, మే 5, (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలోని పారిశుద్ధ్య నిర్వహణలలో దళితబంధు వాహనాలదే కీలక పాత్ర అని తెలంగాణ దళితబంధు స్లిట్ వెహికిల్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. సోమవారం లక్డీకాపూల్‌లోని సామ్రాట్ కాంప్లెక్స్‌లో ఆ సంఘం సమావేశం నిర్వహించారు.
గత కేసీఆర్ సర్కార్ దళితుల అభ్యున్నతికోసం దళితబంధు వాహనాలనందించిందని, జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్లలో డ్రైనేజ్ నుంచి వచ్చే స్లిట్ను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా మలేరియా, డెంగీ వ్యాధుల నివారణకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో స్లిట్ వాహనాలు ప్రజల వద్దకే తీసుకుపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్రం, నరేష్ కుమార్, యాదగిరి తదితర నాయకులు పాల్గొన్నారు.