నియోజకవర్గ వ్యాప్తంగా అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాల వద్ద నివాళి
పాల్గొన్న దళిత సంఘాలు, ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్లు
రాజేంద్రనగర్ జోన్ బృదం,ఏప్రిల్ 14: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతో పాటు దళిత సంఘల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నియోజకవర్గంలోని రాజేంద్రనగర్,అత్తాపూర్,మైలార్‌దేవ్‌పల్లి, బండ్లగూడకార్పొరేషన్,నార్సింగి,మణికొండ, శం షాబాద్ మున్సిపాలిటీలతో పాటు శంషాబాద్ రూరల్ ప్రాంతాల్లో అంబేద్కర్‌కు ఘనంగా నివాళుర్పించారు.
రాజేంద్రనగర్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, జయంతి ఉత్సవాల కమిటీ నాయకులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళు ర్పించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.ఆయన కలలను సాకారం చేసే దిశగా సీఎంకేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు రాష్ట్రంలో 17లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు ను అమలు చేసేందుకు ముందుకొచ్చారని అన్నారు. దళిత బంధు ద్వారా రూ.10 లక్షలు వ్యాపార నిమిత్తం అందిస్తున్నారని తెలిపారు.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో కౌన్సిలర్ కుమార్ బహదూర్ అలీకాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కాలనీ పేరును అంబేద్కర్ కాలనీగా నామకరణం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ, వైస్ చైర్మన్ గోపాల్, గణేశ్‌గుప్త, మార్కె ట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్‌గౌడ్,ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్విరాజు, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి,పీఏసీఎస్ చైర్మన్ దవణాకర్గౌడ్, మోహన్‌రావు, కౌన్సిలర్లు నాయకులు,ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు నర్సింహ, చిట్టిబాబు, నర్సింహ, నాయకులు కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్, నాయకులు శ్రీధర్, దయానంద్,భూపాల్‌రెడ్డి, శ్రవణ్ పాల్గొన్నారు. బండ్లగూడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద అం బేద్కర్ చిత్రపటానికి మేయర్ మహేందర్‌గౌడ్, డిప్యూ టీ మేయర్రాజేందర్రెడ్డి,కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు.బండ్లగూడ కూడలి వద్ద స్వామిగౌడ్, మహేశ్,కార్పొరేటర్ భూపాల్‌గౌడ్, శేఖర్ ముదిరాజ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
సులేమాన్‌నగర్‌లో…
సులేమాన్‌నగర్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు షేక్ నయ్యూమ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని నిర్వ హించారు. పేదలకు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు.