బేగంపేట్ మే 19: మద్యం సేవించిన మత్తులో ఇద్దరు అడ్డా కూలీలు గొడప పడి అందులో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇన్స్పెక్టర్ రాంచందర్ తెలిపిన ప్రకారం నారాయణపేట్ జిల్లాకు చెందిన నర్సి ంహా (47), మరో వ్యక్తి ఉత్తమ్‌లు సికింద్రాబాద్‌లో అడ్డా కూలీలుగా పని చేస్తున్నారు. ఇద్దరూ ప్యాట్నీ సెంటర్లోని హరిహర కళాభవన్ వద్ద ఉండే ఓ భవనంలో పనిచేస్తున్నారు.
రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. భవనం టెర్రస్ పైకి చేరుకున్నారు. ఇద్దరి మధ్య ఏమీ జరిగిందో తెలియదు. నర్సింహా ను ఉత్తమ్ అల్యుమినియం రాడ్‌తో తలపై కొట్టాడు. దీంతో నర్సింహా అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం సంఘటన స్థలానికి వచ్చిన భవనం కాంట్రాక్టర్ రమేష్ నర్సింహా మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు నర్సింహా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఉత్తమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.