ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 26 : ఉస్మానియా యూనివర్సిటీని చెక్ రిపబ్లిక్కు చెందిన వెస్ట్ బొహీమియా యూనివర్సిటీకి చెందిన అధికారుల బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా వారు వివిధ అంశాలపై చర్చించారు. రెండు యూనివర్సిటీల మధ్య పరస్పర అవగాహనా ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను అంచనా వేసుకున్నారు. సంయుక్త ప్రాజెక్టుల సమన్వయం, ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, సంయుక్త పరిశోధనా ప్రచురణలు, సంయుక్త సదస్సులు, ఇతర విద్యాపరమైన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలను వారు చర్చించారు.
ఈ కార్యక్రమంలో వెస్ట్ బొహీమియా యూనివర్సిటీ వైస్ డీన్ ప్రొఫెసర్ జాన్ మిచాలిక్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ హెడ్ కేతరీనా న్యూటన్, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ టు వీసీ ప్రొఫెసర్ జితేందర్‌కుమార్ నాయక్, ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ (ఓఐఏ) డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ హమీద్, డాక్టర్ నాగేశ్వర్రావు, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, డీన్లు ప్రొఫెసర్ సుధ, ప్రొఫెసర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.