సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన బుధవారం కుత్బుల్లాపూర్ జోన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పురోగతిలో ఉన్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, అధికారులతో జవాబుదారితనంగా ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ నెల 30 నాటికి నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలన్నింటినీ పూర్తి చేయాలన్నారు.