పదవీ విరమణ ఉద్యోగానికి ముగింపు మాత్రమే
పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి మాత్రమే ముగింపు అని, సేవా భావానికి కాదని, అది నిరంతరం కొనసాగాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన వీడ్కోలు సభలో పదవీ విరమణ పొందిన 12 మంది పోలీసు సిబ్బందిని కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ ఘనంగా సన్మానించారు.
- సిబ్బంది వీడ్కోలు సభలో సైబరాబాద్ సీపీ రమేశ్
సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి మాత్రమే ముగింపు అని, సేవా భావానికి కాదని, అది నిరంతరం కొనసాగాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన వీడ్కోలు సభలో పదవీ విరమణ పొందిన 12 మంది పోలీసు సిబ్బందిని కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ ఘనంగా సన్మానించారు.
అనంతరం వారికి పెన్షన్ పత్రాలు అందజేసి, ఆత్మీయ వీడోలు పలికారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పని చేసిన రిటైర్డ్ సిబ్బంది సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. పోలీస్ ఉద్యోగం కేవలం వృత్తి మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత అని, దానిని సమర్థవంతంగా నిర్వహించడంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ముఖ్యమన్నారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. తమ అనుభవాలను యువ పోలీసు సిబ్బందితో పంచుకోవాలని కోరారు. పదవీ విరమణ పొందిన వారిలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్) ఎం.ఫజ్లూర్ రెహమాన్, షాద్ నగర్ ఎస్ఐ జి.రామ్ చందర్, చందానగర్ ఎస్ఐ ఎం.
నరసింహారెడ్డి, జీనోమ్ వ్యాలీ ఏఎస్ఐ కమల్ గౌరీ సయ్యద్, అత్తాపూర్ ఏఎస్ఐ ఎం.డి.సర్దార్ బేగ్, మియాపూర్ ఏఎస్ఐ ఎం.నారాయణ, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు చెందిన ఏఆర్ ఎస్ఐలు ఎస్.నాగభూషణం, బి.రమేష్, ఎం.సుధాకర్‌రెడ్డి, పి.లక్ష్మయ్య, బాలానగర్ హెడ్ కానిస్టేబుల్ పి. హుస్సేన్ పీరా, శంషాబాద్ హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ టి.అన్నపూర్ణ, క్రైమ్స్ డీసీపీ ముత్యంరెడ్డి, వుమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కర్ణం, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, సీఏవో వెంకట్‌రెడ్డి, పోలీస్ సహకార సంఘం ఇన్చార్జి జి.మల్లేశం తదితర అధికారులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి కమిషనరేట్‌లో….
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరుగురు పోలీసు అధికారులు శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో మల్కాజిగిరి పోలీసు కమిషనర్ సుమతి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ సుమతి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పోలీసు శాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో సేవలందించడం అభినందనీయమన్నారు.
విధి నిర్వహణలో భాగంగా కుటుంబాలకు దూరంగా ఉన్న పోలీసులు సిబ్బంది పదవీ విరమణ తరువాత విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పదవీ విరమణ పొందిన వారిలో కె.కరుణసాగర్ (ఏసీపీ క్రైమ్స్), పి.బాలరాజు (ఎస్ఐ, కంట్రోల్ రూమ్), ఎస్ఐ టి.ప్రభాకర్, ఏఎస్ఐ మహ్మద్ అలీ, ఏఆర్ఎస్ఐ ఎం.అంజిరెడ్డి, ఏఆర్ కానిస్టేబుల్ జి.నరేందర్‌రెడ్డిలు ఉన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిరా, అదనపు డీసీపీ శివకుమార్, సీఏవో అడ్మిన్ శివకుమార్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ అశోక్‌రెడ్డి, ఎస్బీ ఏసీపీ రవీంద్రరెడ్డి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, కోఆపరేటివ్ సెక్రటరీ/ ఏసీపీ రమేష్, ఎస్టేట్ ఆఫీసర్ నాయుడు, కోఆపరేటివ్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రదీప్‌కుమార్, ట్రెజరర్ బాలరాజు, డైరెక్టర్స్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ కమిషనరేట్‌లో..
సిటీబ్యూరో, మే 30(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీవిరమణ పొందిన పోలీసు అధికారులకు శనివారం కమిషనరేట్‌లో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిటీ పోలీసు కమిషనర్ మాట్లాడుతూ గతంలో సైకిళ్లపై పెట్రోలింగ్ చేసిన నాటి నుంచి నేటి ఇన్నోవా కార్లలో పెట్రోలింగ్ చేసే స్థాయి వరకు పోలీసుశాఖ ప్రస్థానాన్ని చూశారని, పదవీవిరమణ చేసినవారు ఎంతో కష్టపడి పనిచేసినందుకే తెలంగాణ పోలీసు శాఖకు పేరొచ్చిందన్నారు.
పవీవిరమణ తర్వాత వచ్చే రిటైర్మెంట్ సొమ్ము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, అధిక వడ్డీల ఆశతో మోసపోకుండా కేవలం ప్రభుత్వ సంస్థల్లోనే డిపాజిట్ చేసుకోవాలని సూచించారు. సిటీ పోలీస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరపున రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను రిటైరూన అధికారులకు అందించారు. పదవీవిరమణ పొందినవారిలో ఒక ఆర్ఐ, 13మంది ఎస్ఐలు, 13 మంది ఏఎస్ఐలు, నలుగురు హెడ్‌కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్, ఒక జూనియర్ అసిస్టెంట్, నలుగురు ఎల్జీఈలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, అడ్మిన్ డీసీపీ వెంకటలక్ష్మి, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

