Cyber Crime | సిటీబ్యూరో, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్న ఓ మహిళ ఇన్స్టాగ్రామ్ చూ స్తుండగా ఓ లెహంగా కనిపించింది. అది బాగా నచ్చడంతో పూజా కలెక్షన్స్ పేరు తో ఉన్న పేజీలోకి వెళ్లింది. అక్కడ సూ చించిన స్కానర్‌కు రూ.1000 చెల్లించిం ది. డబ్బులు చెల్లించి రెండు రోజులైనా ఆర్డర్ పెట్టిన లెహంగా రాకపోవడంతో పేజీలో కనిపించిన నెంబర్‌కు కాల్ చేసిం ది. ఈ సమయంలో ఖాతా తనిఖీ పేరు తో సైబర్ మోసగాళ్లు ఆమె అకౌంట్ నుంచి రూ.40వేలు కొట్టేశారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల ఓ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టి వెంటనే క్యా న్సిల్ చేసింది. తర్వాత కొద్దిసేపటికే ఒక రు కాల్చేసి యాప్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఆర్డర్ రద్దు చేశాక మనీ ట్రాన్స్ఫర్ అయిందో లేదో తెలుసుకునేందుకు ఓ లింక్ పంపిస్తున్న ట్లు చెప్పారు. నిజమేనని నమ్మి ఆ మహి ళ లింక్ క్లిక్ చేసింది. ఆమె ప్రమేయం లేకుండానే అకౌంట్ నుంచి రూ.1.44లక్షలు బదిలీ అయ్యాయి. ఇలా ఒకట్రెం డు కాదు.. హైదరాబాద్ నగరంలో ఇ లాంటి ఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. డిస్కౌంట్ల పేరుతో సంస్థలు ఇచ్చే ఆఫర్లు చూసి మో సపోయి డబ్బులు పోగొట్టుకుంటున్న మహిళలు ఎంతో మంది ఉన్నప్పటికీ .. కొందరు మాత్రమే పోలీస్స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేస్తుండటంతో ఈ మోసాలు వెలుగు చూస్తున్నాయి.
ప్రత్యేక రోజులు, పండుగల సందర్భంగా పలు సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తా యి. దీన్ని ఛాన్స్‌గా తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. అదే తరహాలో ప్రకటనలు ఇచ్చి మోసం చేస్తారు. భారీ డిస్కౌంట్ అంటే ఆశపడి లింక్ క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్ల చే తికి చిక్కినట్టే. ఇన్స్టాగ్రాం, టెలీగ్రాంల లో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతే కాకుండా ఈ కామ ర్స్ ప్లాట్ ఫామ్స్‌లో జరిగే లావాదేవీల సమాచారం గంటల వ్యవధిలో సైబర్ నేరగాళ్ల చేతికి చేరుతుంది.
సంస్థల ము సుగులో నకిలీ, ఆఫర్ల ప్రకటనలు పంపిస్తున్నారు. ఆయా సంస్థలు ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పో లీసులు సూచిస్తున్నారు. ఈ కామర్స్, పుడ్స్ డెలివరీ సేవలను అఫీషియల్ యాప్‌లు, వెబ్సైట్ల ద్వారానే పొందాలి. ఆర్డర్స్ క్యాన్సిల్, రీఫండ్ విషయంలో సమస్యలుంటే యాప్, వెబ్సైట్లో ఫి ర్యాదు చేయాలి. కొందరు కంప్లైంట్ చే సేందుకు గూగుల్‌లో సంస్థ పేరుతో కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతుకుతారు. అలా చేసినా సమస్యలు వస్తాయి. అం దుకే సరైన వాటినే ఎంచుకుని భారీ డి స్కౌంట్ల ఆశతో మోసపోకుండా జాగ్రత్త గా ఉండాలని సూచిస్తున్నారు.