అమేజాన్ పేరు వాడి బిల్డర్‌కు టోకరా
అమేజాన్ డెలివరీ హబ్ పాయింట్ బిజినెస్ అవకాశం ఇస్తామంటూ నమ్మిస్తూ ఉప్పల్‌కు చెందిన ఓ బిల్డర్‌కు సైబర్ నేరగాళ్లు రూ.3 లక్షలు టోకరా వేశారు. బాధితుడికి అమేజాన్ హబ్ పాయింట్‌కు అవకాశముందంటూ ఒక ఈమెయిల్ వచ్చింది.
సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): అమేజాన్ డెలివరీ హబ్ పాయింట్ బిజినెస్ అవకాశం ఇస్తామంటూ నమ్మిస్తూ ఉప్పల్‌కు చెందిన ఓ బిల్డర్‌కు సైబర్ నేరగాళ్లు రూ.3 లక్షలు టోకరా వేశారు. బాధితుడికి అమేజాన్ హబ్ పాయింట్‌కు అవకాశముందంటూ ఒక ఈమెయిల్ వచ్చింది. దీంతో అందులో ఉన్న ఫోన్ నెంబర్‌కు బాధితుడు కాంటాక్టు చేయడంతో తమ పేర్లు రామ్, శ్రీకాంత్ అని తాము అమేజాన్‌తో మీకు వ్యాపార అవకాశాన్ని కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. దీనికి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఫార్మాలిటీస్ పూర్తి చేయాలంటూ ఒక ఫామ్ పంపించారు.
అందులో వివరాలతో పాటు రూ.3 లక్షలు పంపించాలని ఉండడంతో డబ్బులు కూడా పంపించాడు. ఆ తరువాత మరో రూ. 50 వేలు చెల్లించి, ఎంఓయు చేసుకోవాలని సూచించారు. ఈ మొత్తం మీకు తిరిగి వచ్చేస్తాయంటూ నమ్మించారు. అయితే వారి మాటలతో అనుమానం వచ్చిన బాధితుడు అమేజాన్‌లో తెలిసిన వారి వద్ద వాకబు చేయగా అదంతా మోసమని, అలా ంటి వారిని నమ్మొద్దంటూ సూచించారు. దీంతో బాధితుడు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

