సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పార్ట్‌టైమ్ ఉద్యోగం, పెట్టుబడుల పేరుతో సైబర్‌నేరగాళ్లు లక్షలు దోచుకుంటున్నారు. మీర్‌పేట్‌కు చెందిన బాధితురాలు వృత్తిరీత్యా ప్రైవేట్ ఉద్యోగి. వాట్సాప్‌లో గుర్తుతెలియని నెంబర్ నుంచి ఆరుషి అగర్వాల్ బంధన్ మార్కెట్ అసోసియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పార్ట్‌టైమ్ జాబ్ అవకాశాలు ఉన్నాయంటూ మేసేజ్ వచ్చింది. బిట్‌కాయిన్ ట్రేడింగ్ చేయడమే ఈ పార్ట్‌టైమ్ ఉద్యోగమని ఒక డెమో చూపించారు. తరువాత కొద్దిసేపటికి బాధితురాలికి ఇచ్చిన చిన్న టాస్క్‌ను పూర్తి చేయించి ఆమెకు స్వల్ప లాభాలు పంచారు. నమ్మకం కుదిరించారు.
ఆ తర్వాత ఐజీకాయిన్.టాప్ వెబ్సైట్లో రిజిస్టేష్రన్ చేసుకోవాలని సూచించారు, అందులో టాస్క్‌లు పూర్తి చేయాలని రోజు వారిగా మంచి సంపాదన ఉంటుందని సూచించారు. మూడు టాస్క్‌లు పూర్తి చేసిన తరువాత ఆమెకు ఫిక్స్డ్ జీతం ఇస్తామంటూ నమ్మించారు. లాభాలొస్తున్నాయంటూ స్కీన్ప్రై చూపించారు. అప్పటికే రూ. 8,91 లక్షలు బాదితురాలు ఇన్వెస్ట్ చేసింది, ఇంకా రూ. 5.56 లక్షలు పెట్టుబడి పెడితే మీకు ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను రిపేర్ చేసి మరిన్ని లాభాలు తీసుకురావచ్చంటూ నమ్మించారు.
ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో వ్యాపారంలో పెట్టుబడులు పేరుతో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారస్తుడిని ఈ ఇద్దరు నేరస్తులు ఫోన్లో సంప్రదించి ఆయన ఉత్పత్తులకు ఆర్డర్లిస్తామని చెప్పి నమ్మించారు. నేరగాళ్ల మాటలు నమ్మిన వ్యాపారస్తుడు చార్జెస్ కింద రూ.9,50,531లు వారికి పంపించాడు. బాధితుడితో సంప్రదింపులు మానేయడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.