డిజిటల్ అరెస్టు.. రూ.33.5 లక్షల టోకరా
డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్‌నేరగాళ్లు రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి నుంచి రూ.33.5 లక్షలు కాజేశారు. అల్వాల్ కి చెందినబాధితుడికి జూన్ 30న ఫోన్‌కాల్ వచ్చింది. తాము ఢిల్లీ పోలీసులమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నుంచి మాట్లాడుతున్నామని తన పేరు సుచన వైభగ్ అని ఒకరు పరిచయం చేసుకున్నాడు.
సిటీబ్యూరో, జూలై 15(నమస్తే తెలంగాణ): డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్‌నేరగాళ్లు రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి నుంచి రూ.33.5 లక్షలు కాజేశారు. అల్వాల్ కి చెందినబాధితుడికి జూన్ 30న ఫోన్‌కాల్ వచ్చింది. తాము ఢిల్లీ పోలీసులమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నుంచి మాట్లాడుతున్నామని తన పేరు సుచన వైభగ్ అని ఒకరు పరిచయం చేసుకున్నాడు. మీపైమనీలాండరిగింగ్ కేసు నమోదైందని, అందుకు సంబంధించిన విచారణ వర్చువల్‌గా చేస్తున్నామని తెలపడంతో బాధితుడు భయపడిపోయాడు. బాధితుడి ఫోన్లో ఐఎంఓ యాప్‌ను డౌన్లోడ్ చేయించి వీడియో కాల్స్ చేశారు.
బాధితుడి బ్యాంక్ వివరాలు తెలుసుకొని.. మీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేస్తున్నామని విచారణ తర్వాత మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయంటూ నమ్మించారు. ఈ క్రమంలో బాధితుడు తన 2 బ్యాంకు ఖాతాల్లోని రెండు ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసుకొని ఈనెల 3న రూ.12 లక్షలు, 8న రూ.21.5 లక్షలు సైబర్ నేరగాళ్లు సూచించిన అకౌంట్లో బదిలీ చేశాడు. ఐదు రోజుల పాటు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచిన బాధితుడు 12వ తేదీ రాత్రి తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. ఇదం తా మోసమని స్నేహితుడు చెప్పడంతో మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

