సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ ఫ్రాడ్‌కు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఒక్క కమిషనరేట్ పరిధిలోనే రోజుకు కోటి, రెండు కోట్లు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 కోట్ల వరకు కేవలం ట్రేడింగ్‌కు సంబంధించి మోసాలకు పాల్పడుతున్నారు. అయితే మో సపోతున్నవారిలో బాగా చదువుకున్నవారే అధికంగా ఉండడం గమనార్హం. ఒక బ్రోకరేజ్ సంస్థ తరపున డీమాట్ ఖాతా తెరిచి, స్టాక్స్ ట్రేడింగ్ చేస్తున్నారంటే ఒకే ఖాతా నుంచి లావాదేవీలు జరగాలి. కానీ బాగా చదువుకున్న వాళ్లు కనీసం ఈ విషయాన్ని కూడా గుర్తు పట్టడం లేదు.
సైబర్‌నేరగాళ్లు.. తమ సొంత యాప్‌లు, వెబ్సైట్లలో లాగిన్ ఐడీలు ఇచ్చి అందులో నుంచే స్టాక్స్ కొనిపిస్తున్నారు. ఆయా వెబ్సైట్లు, యాప్‌ల్లో నుం చి కాకుండా యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ ల ద్వారా ఎప్పటికప్పుడు బ్యాంకు ఖాతాలను బాధితులకు పంపిస్తూ ఆయా ఖాతా ల్లో డబ్బులు డిపాజిట్ చేయాలని సూచన లు చేస్తున్నారు. ఇక్కడే బాధితులు ఎందుకు వివిధ ఖాతాలు ఇస్తున్నారని అనుమానించి ఆరా తీస్తే అది మోసమని తేలేది.. కానీ బాధితులు ఎవరు కూడా ఆ పని చేయకుం డా నిండా మునుగుతున్నారు. ఒక్క రోజులోనే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ట్రే డింగ్‌కు సంబంధించి సుమారు 2కోట్ల వర కు సైబర్‌నేరగాళ్ల చేతిలో మోసపోయారు.