Cyber Crime | సిటీబ్యూరో, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ): తక్కువ పెట్టుబడికి అతి తక్కువ సమయంలో రెట్టింపు రాబడి వస్తుందంటూ అమాయకుల ఖాతాలు ఖాళీ చేస్తున్న ఓ ఘారాన సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… యూపీకి చెందిన ఆకాశ్ అలియాస్ ఆకాశ్ వర్మ(22) వృత్తిరీత్యా ఎలక్టీష్రియన్.
డబ్బుకోసం నిందితుడు వాట్సాప్, టెలీగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని, తమ వద్ద పెట్టుబడులు పెడితే, తక్కువ సమయంలో రెట్టింపు రాబడి వస్తుందని నమ్మిస్తారు. అందు కోసం మొదట్లో కొంత రాబడి అందజేసి నమ్మిస్తారు. అది నమ్మిన ప్రజలు ఆశతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతారు. బాధితులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వెంటనే విత్‌డ్రాల్స్‌ను బ్లాక్ చేసి, అందినకాడికి దోచుకుంటారు.
ఈ క్రమంలోనే నగరానికి చెందిన ఓ వ్యక్తికి, నిందితుడు వాట్సాప్ కాల్ చేసి తనను తాను సంజయ్గా పరిచయం చేసుకున్నాడు. అంతే కాకుండా మరో వ్యక్తి అబకస్ అమైని కూడా పరిచయం చేశాడు. అనంతరం ఒక అప్లికేషన్ లింక్ పంపించి, డౌన్లోడ్ చేసుకోవాలని సూ చించాడు. ఈ లింగ్ ద్వారా ట్రేడింగ్ చేస్తే తక్కువ సమ యంలోనే అధిక రాబడి వస్తుందని నమ్మించాడు. దీంతో బాధితుడు ఆ లింక్‌ను డౌన్లోడ్ చేసుకుని ట్రేడింగ్ మొదలుపెట్టాడు.
మొదట్లో కొంత రాబడి ఇచ్చిన అగం తకుడు ఆ తరువాత పెద్ద మొత్తంలో రాబడి కోసం అబ కస్‌ను సంప్రదించాలని సూచిస్తూ వాట్సాప్ గ్రూప్-2లో బాధితుడిని యాడ్ చేయించాడు. సంజయ్ మాటలను నమ్మిన బాధితుడు అబకస్ను సంప్రదించగా.. తనకు చూ పిస్తున్న మొత్తం రాబడిపై 10శాతం డబ్బు జమ చేయాలని సూచించాడు. అది న మ్మిన బాధితుడు పలు మార్లు డబ్బును అగంతకులు సూచించిన ఖాతాలో జమ చేస్తూ రూ.1.47కోట్లు మోసపోయాడు. అప్పుడు విషయాన్ని గ్రహించిన బాధితు డు నగర సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.