Cyber Crime | సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ‘హాలో అండి. నా పేరు రాజారాం. నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను. ట్రేడింగ్ పేరుతో నా వాట్సాఫ్‌కు మేసేజ్ వచ్చింది. ఆ మేసేజ్‌కు స్పందించిన నేను ముందుగా తక్కువ పెట్టుడి పెట్టాను. రూ.20 వేల లాభం చూపారు. దీంతో నేను వెంటనే స్పందించా ను. ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టాను.
నాకు డబ్బు అవసరమై.. విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాను. కాగా ఆ యాప్ నుంచి అప్షన్ తీసేశారు. ఇలా నేను రూ.89 లక్షలు మోసపోయాను. మీరు ఎవరు కూడా వాట్సాఫ్, టెలిగ్రామ్‌లలో వచ్చే ట్రేడింగ్ మేసేజ్‌లకు స్పందించవద్దు.. ట్రేడింగ్ పేరుతో మోసం చేసేందుకు సైబర్ఛీటర్స్ సిద్ధంగా ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి’ అంటూ ఒక బాధితుడు ప్రజలకు సూచించాడు..
వాట్సాప్, టెలిగ్రామ్‌లలో సైబర్‌నేరగాళ్లు మేసేజ్‌లు పంపిస్తుంటారు. మరికొందరు గ్రూప్‌లో తయారు చేసి ట్రేడింగ్ అనాలసిస్ట్ అంటూ ఆ గ్రూపుల్లో డిస్కషన్ చేస్తుంటారు. ఆ డిష్కన్లలో సైబర్‌నేరగాళ్ల ముఠానే పాల్గొంటుంది. ప్రశ్నలు అడిగిది వారే.. సమాధానాలు చెప్పేది వాళ్లే. ఆ చర్చల్లో జరిగే సంభాషణలు చూసి అప్పుడప్పుడే అందులో కొత్తగా చేరిన వారు అబ్బా నిజమే కదా అనుకుంటారు. ఎవరో ఒకరు టెంప్ట్ అయి మేం కూడా ట్రేడింగ్ గూర్చి తెలుసుకోవాలని అనుకుంటున్నామంటూ మాటలు కలిపారంటే.. ఇక అంతే. అన్ని విషయాలు చర్చించిన తరువాత తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టించి కొంత లాభం పంపిస్తారు. లాభం రాగానే.. ఇదంతా నిజమని నమ్మి భారీ మొత్తంలో అందినకాడికీ దోచేస్తారు. ఇదంతా సైబర్‌నేరగాళ్లు ప్రత్యేక యాప్‌లతో నిర్వహిస్తూ అమాయకులను అట్టే నమ్మిస్తారు.
మొదట తక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు విత్‌డ్రా అప్సన్ పనిచేస్తుంది. ఆ తరువాత బాధితుడిని మాటల్లో పెట్టి నెమ్మదిగా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టిస్తూ వెళ్తారు. స్క్రీన్‌పై లాభాలు భారీగా కన్పిస్తుంటాయి. అయితే అప్పటికే బ్యాకెండ్‌లో విత్‌డ్రా అప్షన్ తొలగిస్తారు. అప్పటికే కొంత మొత్తం పెట్టుబడి పెట్టి ఉండే బాధితులు, ఇంకొంచెం పెడితే ఎక్కువ లాభాలొస్తాయనే యావతో పెట్టుబడి పెడుతూ వెళ్తారు. అనుమానం వచ్చినా మధ్యలో నుంచి బయటకు వెళ్లకుండా.. ఇంకోసారి ప్రయత్నం చేద్దామనుకునే వాళ్లు కొందరు మరింత ముందుకు వెళితే ఆర్థికంగా భారీగా నష్టపోవడం ఖాయం.
ప్రతిరోజూ సైబర్ మోసాలపై పదుల సంఖ్యలో బాధితులు సైబర్ ఠాణాల్లో ఫిర్యాదులు చేస్తుంటారు. ఇందులో కొందరు బాధితులు తమ పేరు బయట పడొద్దనుకొని గప్‌చుప్‌గా ఉంటారు. అయితే మరికొందరు మాత్రం నాలాగ.. ఇంకొకరు మోసపోవద్దని భావిస్తుంటారు. ఇలాంటి వారి నుంచే తాము మోసపోయాం.. మీరూ మోసపోవద్దనే సందేశాలు ఇప్పిస్తున్నారు. సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు సైబర్‌క్రైమ్ పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.