సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): మ్యాట్రీమోని సైట్లో ప్రొఫైల్ చూసి పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించి.. ఆపై తన కుటుంబ అవసరాలకు అత్యవసరంగా డబ్బు కావాలంటూ బాధితురాలి నుంచి సైబర్‌నేరగాళ్లు రూ.3.6 లక్షలు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బోయిన్‌పల్లిలో ఉండే బాధితురాలు.. పెండ్లి కోసం తన ప్రొఫైల్‌ను షాది.కామ్‌లో రిజిస్ట్రేషన్ చేసింది. దానిని చూసిన సైబర్ నేరగాడు.. తన పేరు రిహాన్ అహ్మద్ అని.. మీ ప్రొఫైల్ నచ్చిందంటూ పరిచయం చేసుకున్నాడు. తాను ఢిల్లీలో ఉంటానని, ఎక్స్‌పోర్టు, ఇంపోర్టు బిజినెస్ చేస్తానని, తన తండ్రి గురుగావ్ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడని వివరాలు వెల్లడించాడు.
వారం రోజుల పాటు వాట్సాప్‌లో పెండ్లి, కుటుంబం, వ్యాపారికి సంబంధించిన అంశాలపై చర్చించుకున్నారు. ఆకస్మాత్తుగా ఒక రోజు సైబర్‌నేరగాడు షాది.కామ్ నుంచి తన ప్రొఫైల్‌ను తొలగించేశాడు. ప్రొఫైల్‌లో ఫొటో లేకపోవడంతో, ఫొటో కావాలంటూ బాధిత యువతి కోరింది.. దీంతో అతను.. ఫొటో వద్దు..నేరుగా కలుస్తానంటూ నమ్మించాడు. రెండు నెలల పాటు ఎలాంటి ఫోన్ కాంటాక్టులు లేకపోవడంతో ఆ పెండ్లి సంబంధం రద్దయ్యిందని భావించుకున్నది. తిరిగి రెండు నెలల తరువాత బాధిత యువతికి రిహాన్ అహ్మద్ పేరుతో సైబర్‌నేరగాడు టచ్‌లోకి వచ్చాడు. కొన్నాళ్లు మాట్లాడుకున్న తరువాత, తన వ్యాపారానికి సంబంధించిన చెక్కులను ఆయా ఎయిర్‌పోర్టుల నుంచి వసూలు చేయాల్సి ఉందంటూ చెప్పాడు.
మరుసటి రోజు తాను అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చెక్ తీసుకోవడానికి వెళ్తున్నానంటూ చెప్పి, ఆ తర్వాత అహ్మదాబాద్‌లో ఉన్నానని, సడన్‌గా రావడంతో తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని, ఇంటి వద్ద తన తలిక్లి సీరియస్‌గా ఉందని, కొద్దిగా డబ్బు సర్దితే వెంటనే ఢిల్లీకి వెళ్లగానే తిరిగి పంపిస్తానంటూ నమ్మించాడు. అలా తల్లి సెంటిమెంట్ చెబుతూ దఫ దఫాలుగా బాధిత యువతి నుంచి రూ. 4.41 లక్షలు వసూలు చేశాడు. అందులో నుంచి రూ. 77,500 తిరిగి చెల్లించాడు. ఆరు నెలల వరకు టచ్‌లో ఉంటూ మరింత డబ్బులు అడుగుతుండడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.