అంతర్రాష్ట్ర ముఠాలపై నిఘా పెంచాలి
వేసవిలో జరిగే దోపిడీ, దొంగతనాలను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేశారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్‌లో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
- వేసవి దోపిడీల నివారణకు సైబరాబాద్ పోలీసుల యాక్షన్ ప్లాన్
- పోలీస్ స్టేషన్ల వారీగా సమీక్షలు జరుపాలి
- సమీక్షా సమావేశంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : వేసవిలో జరిగే దోపిడీ, దొంగతనాలను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేశారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్‌లో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మర్ క్రైమ్స్‌లో ముఖ్యంగా ఆటోమొబైల్, హౌస్ హోల్డ్ థెఫ్ట్, ప్రాపర్టీ థెఫ్ట్ వంటి ఆర్థిక పరమైన నేరాలు ఎకువగా జరుగుతుంటాని అన్నారు. కమిషనరేట్ పరిధిలో గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న సమ్మర్ క్రైమ్స్ పైన జరిపిన అధ్యయనంలో ప్రధాన హాట్ స్పాట్స్‌ని గుర్తించినట్లు పేర్కొన్నారు.
దీనికి సంబంధించి ఈనెల 10న యాక్షన్ ప్లాన్స్ కోసం సరులర్ మెమో జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సమ్మర్ క్రైమ్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ పైన సిబ్బంది యాక్షన్ ప్లాన్‌ను అడిగి తెలుసుకున్నారు. జోన్ల వారీగా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన హాట్ స్పాట్లపై రోజువారి సమీక్ష నిర్వహించుకోవాలని సూచించారు. కానిస్టేబుల్ నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు కలిసికట్టుగా క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రైమ్ డి టెన్షన్ కోసం కృషి చేయాలని, ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెరిగేలా పనిచేయాలని తెలిపారు. ఇక నుంచి తాను స్వయంగా జోన్లవారీగా డే అండ్ నైట్ బీట్లను పర్యవేక్షిస్తానని చెప్పారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంతర్రాష్ట్ర ముఠాలపై నిఘా ఉంచాలని, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లలో అవగాహన సదస్సులు నిర్వహించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకునేలా సూచనలు ఇవ్వాలని తెలిపారు. జైలు నుండి విడుదలైన పాత నేరస్తులపై, హోటల్స్, లాడ్జీలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేయాలన్నారు. ఈ సమావేశంలో క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, మేడ్చల్ డీసీపీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

