సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశా రు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి కేసు వివరాలను వెల్లడించారు. రాజస్థాన్‌కు చెం దిన వికాస్ ఉపాధి కోసం 2019లో నగరానికి వలసొచ్చి షాద్‌నగర్, రాయికల్‌లోని సం జూబాయ్ మార్వాడీ దాబాలో వాచ్‌మన్‌గా చేరాడు.
వంటలు చేయడం నేర్చుకుని ఆ దాబాలోనే కుకింగ్ మాస్టర్‌గా పనిచేస్తున్నా డు. అయితే, దాబా యజమాని సంజూబాయ్కి గంజాయి పీల్చే అలవాటు ఉండడంతో అతడికి గంజాయి సరఫరా చేయడం మొద లెట్టాడు. దాబాకు వచ్చే లారీ డ్రైవర్లు, ఇతరులకు సైతం అధిక ధరలకు గంజాయి విక్రయించేవాడు. ధూల్‌పేటకు చెందిన సలీం నుంచి గంజాయి కొనుగోలు చేసి తన యజమాని సహా ఇతరులకు విక్రయించేవాడు. కాగా గత నెల 28న అనారోగ్యంతో దాబా యజమాని సంజూబాయ్ మృతిచెందడంతో వికాస్ ఒక్కడే డ్రగ్స్ విక్రయాలు కొనసాగిస్తున్నాడు.
గత వారం గణ్‌పత్ నుంచి 1.5 కిలోల హెరాయిన్, 750 గ్రాముల ఓపీయం, 3.5 కిలోల పప్పి స్ట్రా మత్తు పదార్థాన్ని, ధూల్‌పేటకు చెందిన రాజు నుంచి 1.5 కిలో ల గంజాయిని కొన్నాడు. కొంత డ్రగ్స్ విక్రయించడంతో రూ. 89,700 వచ్చాయి. మిగిలిన మత్తు పదార్థాలు విక్రయించేందుకు యత్నిస్తుండగా సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు షాద్‌నగర్ పోలీసులతో కలిసి దాబాపై దాడి చేశారు. ఈ దాడిలో నిందితుడు వికాస్‌ను అరెస్టు చేసి అతడి నుంచి రూ. 3,50, 27,700 విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్, గంజాయికి సంబంధించి సమాచారముంటే స్థానిక పోలీసులు లేదా 100కు ఫోన్ చేయాలని.. చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీపీ తెలిపారు.