సిటీబ్యూరో, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): హాయ్.. ఐ జస్ట్ ఫౌండ్ యువర్ ఫొటో లాంటి సందేశం వచ్చిందా.. మీకు తెలిసిన వారి నంబర్ల నుంచి మెసేజ్‌లు, లిం కులు వస్తున్నాయా.. ఎందుకైనా మంచిది ఒకసారి రీ చెక్ చేసుకోండి.. అంటూ హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. సైబర్‌నేరగాళ్లు కొత్తకొత్త స్కామ్స్‌తో వస్తున్న క్రమంలో తాజాగా ‘ఘోస్ట్ పెయిరింగ్’ స్కామ్ జరుగుతున్నదని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. నకిలీ లింకుల ద్వారా ఖాతాలను హైజాక్ చేయడానికి యాప్ డివైజ్-లింకింగ్ ఫీచర్‌ను ఉపయోగించు కుంటున్నారంటూ కొత్త వాట్సప్ స్కామ్ గురించి వినియోగదారులకు చెప్పారు.
ఈ స్కామ్ సోషల్ ఇంజినీరింగ్‌పై ఆధారపడి ఉంటుందని, పాస్వర్డ్, ఓటీపీ లేదా సిమ్ మార్చే అవసరం లేకుండానే ఒక వ్యక్తి వాట్సప్ ఖాతాను పూర్తిగా యాక్సెస్ చేయడం కోసం డివైజ్ లింకింగ్ ఫీచర్‌ను వాడుకుంటున్నారని వారు పేర్కొన్నారు. సైబర్‌నేరగాళ్లు మనకు తెలిసిన కాంటాక్ట్లనుంచి మన మొబైల్‌లోకి చొరబడుతు న్నారని.. ఇందుకు వాట్సప్ సందేశాలను ఉపయోగిస్తున్నారని ఈ కొత్త తరహా మోసం పేరే ఘోస్ట్ పెయిరింగ్ అని చెప్పారు. లింక్డ్ డివైజెస్ ఫీచర్‌ను దుర్వినియో గం చేసి యూజర్ ఖాతాలోకి చొరబడుతున్న సైబర్‌నేరగాళ్లు బాధితుల అకౌంట్లలో డబ్బును ఖాళీ చేసేస్తున్నారు.
Hey I just foynd your Photo లాంటి సందేశంతో ఈ స్కామ్ మొదలవుతుంది. ఇందులో ఒక లింక్ ఉంటుంది. ఇది ఫేస్బుక్ ఫొటో వ్యూయర్‌ను తలపించేలా నకిలీ వెబ్‌పేజ్‌ను డిస్ప్లే చేస్తుంది. ఇందులోని కంటెంట్‌ను చూడాలంటే వెరిఫికేషన్ అడుగుతారు. దీన్ని ఒకే చేస్తే ఇక్కడినుంచే స్కామర్లు బురిడీ కొట్టిస్తాయి. ఒక్కో స్టెప్‌కు వెళ్తున్న కొద్దీ బ్యాక్‌గ్రౌండ్‌లో డివైజ్ పెయిరింగ్ బాధితులకు తెలియకుండానే జరుగుతుంది. ఒక ఫోన్‌నంబర్‌ను ఎంటర్ చేయాలన్నా రిక్వెస్ట్ వస్తుం ది. దాని తర్వాత న్యూమరిక్ పెయిరింగ్కోడ్ను జనరేట్ చేస్తుంది. ఈ కోడ్‌ను వాట్సప్‌లో ఎంటర్ చేయాలని నకిలీ పేజిలో ఒక సూచన కనిపిస్తుంది. ఇదంతా సెక్యూరిటీ స్క్రూటినీలో భాగమని చెబుతుంది. ఆ కోడ్‌ను ఎంటర్ చేయగానే బాధితులకు తెలియకుండానే స్కామర్ వారి డివైజ్‌తో లింక్ అవుతుంది. వాట్సప్ వెబ్యాక్సెస్ మొత్తం హ్యాకర్ చేతికి వెళ్తుంది. మన మెసేజ్‌లన్నీ చదువుతారు. మనం పంపినట్లే ఇతరులకు పంపుతారు.
ఘోస్ట్ పెయిరింగ్ సమస్యపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సీరియస్‌గా స్పందించారు. జాగ్రత్తగా ఉండాలని మొబైల్ యూజర్లను హెచ్చరించారు. వాట్సప్‌లో ఘోస్ట్ పెయిరింగ్ పేరుతో కొత్త స్కామ్ జరుగుతున్నదని సజ్జనార్ తెలిపారు. హెయ్ మీ ఫొటో చూశారా అంటూ వస్తున్న లింక్‌పై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని కోరారు. పొరపాటున ఆ లింక్‌పై క్లిక్ చేస్తే.. హ్యాకర్ల డివైజ్‌కు యూజర్ల అకౌంట్ కనెక్ట్ అవుతుందని, దీంతో వారి వ్యక్తిగత సమాచారమంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లి సమస్యలు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఈ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే వాట్సప్ సెటింగ్స్‌లో లింక్డ్ డివైజెస్ ఆప్షన్‌ను చెక్‌చేసి తెలియని డివైజ్‌లు ఉంటే రిమూవ్ చేయాలని సజ్జనార్ సూచించారు.