పోయింది 2.69 కోట్లు.. రిఫండ్ రూ.21.6 లక్షలు
మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులు గత వారం రోజుల్లో ఐదు కేసులను ఛేదించి ఆయా కేసులలో నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ నాగలక్ష్మి వెల్లడించారు. ఈ కేసుల్లో బాధితులకు రూ.21,60,112 రిఫండ్ ఇచ్చినట్లు తెలిపారు. మూడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఒకటి డిజిటల్ అరెస్ట్, లోన్ ఫ్రాడ్ కేసులలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు.
- ఖాతాదారులతోనే సరిపెట్టేస్తున్న వైనం
- వారంలో ఐదు కేసుల్లో ఐదుగురు సైబర్‌నేరగాళ్ల అరెస్ట్
- నిందితులంతా తెలుగు రాష్ర్టాల వారే
సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులు గత వారం రోజుల్లో ఐదు కేసులను ఛేదించి ఆయా కేసులలో నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ నాగలక్ష్మి వెల్లడించారు. ఈ కేసుల్లో బాధితులకు రూ.21,60,112 రిఫండ్ ఇచ్చినట్లు తెలిపారు. మూడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఒకటి డిజిటల్ అరెస్ట్, లోన్ ఫ్రాడ్ కేసులలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు.
- స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే లాభాలిస్తామని నమ్మించి సైబర్‌నేరగాళ్లు బాధితుడిని రూ. 51.50 లక్షలకు మోసం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో బ్యాంకు ఖాతాదారుడిగా వెస్ట్‌గోదావరి జిల్లాకు చెందిన కడాలి వెంకట కృష్ణను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు సైబర్‌నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని, నిందితుడి ఖాతాకు 11 కేసులతో సంబంధాలున్నాయని తెలిపారు.
- మరో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో బాధితుడి వద్ద నుంచి సైబర్‌నేరగాళ్లు రూ.1,44,20,000 మోసం చేశారు. ఈ కేసులో తిరుపతి జిల్లాకు చెందిన పాముల వెంకటేష్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడికి 16 కేసులతో సంబంధమున్నట్లు పోలీసులు తేల్చారు.
- ఇంకో కేసులో బాధితుడు రూ.4.43 లక్షలు మోసపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడు చార్మినర్‌కు చెందిన మహ్మద్ యూనస్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు, నిందితుడికి 16 కేసులతో సంబంధమున్నట్లు దర్యాప్తులో బయటపడింది.
- డిజిటల్ అరెస్ట్‌లో బాధితురాలి వద్ద నుంచి సైబర్‌నేరగాళ్లు రూ. 64 లక్షలు కొట్టేశారు. ఈ కేసులో సికింద్రాబాద్‌కు చెందిన సోనబోయిన రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి మూడు కేసులతో సంబంధాలున్నట్లు పోలీసులు వెల్లడించారు.
- లోన్ ఇప్పిస్తామని నమ్మించి బాధితుడి వద్ద నుంచి రూ. 5.11 లక్షలు కాజేసిన కేసులో నల్గొండ జిల్లాకు చెందిన కాలకొండ మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖాతాదారులతోనే..!
సైబర్ కేసుల దర్యాప్తులో మల్కాజిగిరి పోలీసులు రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉండే ఖాతాదారులపైనే దృష్టి సారిస్తున్నారు, సైబర్‌నేరగాళ్లకు ఖాతాలు సరఫరా చేస్తున్నవారు, ఆయా ఖాతాలలో డబ్బులు బాధితులు డిపాజిట్ చేసినట్లు దర్యాప్తులో తేలితే అలాంటి కేసులకు ప్రాధాన్యత ఇస్తూ మిగతా కేసులను పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేసుల మూలాల వరకు వెళ్లి నిందితులను పట్టుకోవడం, మూల్ ఖాతాలకు సూత్రధారులెవరో గుర్తించి ఆయా నెట్‌వర్క్‌ను ఛేదించడంపై దృష్టి సారించడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐదు కేసులలో సుమారు రూ. 2.69 కోట్లు నష్టపోగా పోలీసులు కేవలం రూ.21.60 లక్షలు రిఫండ్ ఇప్పించారు. బాధితులు ఎన్సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంతో అక్కడి నుంచి నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరుపుతూ ఫండ్ తెప్పిస్తూ అంతటితోనే ఆయా కేసుల దర్యాప్తు పూర్తయ్యిందనే బావనతో ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. లోతైన దర్యాప్తు జరిపితే కీలక సైబర్నేరగాళ్లను పట్టుకోవడం, మూల్ ఖాతాల నెట్‌వర్క్‌ను తెగొట్టి, సూత్రధారుల వరకు కూడా వెళ్లేందుకు అవకాశాలున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

