సిటీబ్యూరో: ఓ వ్యాపారి సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి రూ.1.56 కోట్లు పోగొట్టుకున్నాడు. కాప్రాకు చెందిన బాధితుడు తన ఫేస్బుక్ అకౌట్ బ్రౌజ్ చేస్తుండగా ఫైనల్ టు ఫిజికల్.కామ్‌తో పాటు మరో వెబ్సైట్ లింక్‌లను క్లిక్ చేశాడు. అందులోకి వెళ్లగానే మీరు స్టాక్ ట్రేడింగ్ చేసి అధిక లాభాలు సంపాదించేందుకు కావాల్సిన మెలుకువలు చెబుతామంటూ సూచనలు చేశారు. బాధితుడి నెంబర్ వాట్సాప్ గ్రూప్‌నకు యాడ్ అయ్యింది. తాను కస్టమర్ సపోర్టు టీమ్ నుంచి మాట్లాడుతున్నామని ఓ మహిళ మాట్లాడింది. కొంత డబ్బును అకౌంట్లో డిపాజిట్ చేసి స్టాక్ ట్రేడింగ్ చేయాలని సూచనలు చేశారు.
దీంతో బాధితుడు దఫ దఫాలుగా లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం స్క్రీన్‌పై యూఎస్డీటీ కన్వర్ట్ అయినట్లు చూపించడం, వాటితో స్టాక్స్ కొనడం, ఆపై అమ్మడంతో లాభాలు వచ్చినట్లు స్క్రీన్‌పై భారీగా లాభాలు కన్పించాయి. మొదటి దఫలో రూ. 38 వేలు విత్ డ్రా చేసుకోవడంతో మరింత నమ్మకం కల్గింది. ఇలా దఫ దఫాలుగా బాధితుడు రూ. 1,56,98,695 సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు డిపాజిట్ చేస్తూ వెళ్లాడు. అందులో నుంచి లాభంగా రూ. 72087 మాత్రం తిరిగి పొందగలిగాడు. మిగతా రూ. 1,56,26,608 సైబర్‌నేరగాళ్లు దోచేశారు.