సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): జాతకాల పేరుతో ఆన్లైన్లో బురిడీ బాబాలు అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. లోకల్ టీవీ చానల్స్‌లో ప్రకటనలు ఇచ్చే ఈ బాబాలు.. ఇప్పుడు సోషల్‌మీడియాలో ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లను వేదిక చేసుకుంటున్నారు. ప్రేమ, పెండ్లిళ్లు, ఉద్యోగాలు, ఆరోగ్యం, సంపద.. ఇలా మీకు ఏవి అనుకూలించకున్నా ఫలాన బాబాను సంప్రదించండంటూ ప్రకటనలు ఇస్తూ అమాయకులను ఆకర్షిస్తుంటారు. బాబాలను ఆశ్రయించి మోసపోయిన కొందరు పోలీసులను ఆశ్రయిస్తుండగా .. మరికొందరు విషయం బయటకు తెలిస్తే విలువ పో తుందని ఆలాగే ఉంటున్నారు.
అలాగే.. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, ట్రేడింగ్ అంటూ భారీ మోసాలకు పాల్పడుతున్న సైబర్‌నేరగాళ్లు, రోజుకు ఒక కొత్త పంథాలో మోసం చేసేందుకు ఇంటర్నెట్ను వేదికగా వాడుకుంటున్నారు. ఈజీగా డబ్బు సంపాదించాలని కొందరు సైబర్నేరగా ళ్లు వేసే వలలో చిక్కుకుంటుంటే.. మరికొందరు ఇలాంటి బురిడీ బాబాలను సంప్రదిస్తూ నిండా మునిగిపోతున్నారు. గతంలో ఢిల్లీకి చెందిన నకిలీ బాబాలు లోకల్ టీవీల్లో యాడ్స్ ఇస్తూ అమాయకులను ఆకర్షించేవారు. ఈ బాబాలు కే వలం ఫోన్లలోనే టచ్‌లో ఉంటూ మీ కో సం మేం పూజలు చేస్తాం, డబ్బులు పం పించండని చెబుతూ ఉండేవారు.
ఇ లాంటి వారిచేతిలో చాలామంది మోసపోవడంతో పోలీసులు పలువురు బురిడీ బాబాలను అరెస్ట్ చేశారు. కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ఈ మోసాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఒక పక్క టీవీల్లో ప్రకటనలు ఇస్తూనే, మరో పక్క సోషల్‌మీడియాను కూడా వాడుకుంటున్నారు. సోషల్‌మీడియాలో వచ్చే ప్రకటనలతో అందినకాడికి దోచేస్తున్నారు. వేలల్లో మోసపోతున్న వారు చాలామంది ఉంటున్నారు. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో వచ్చే నకిలీ బాబాల ప్రకటనలతో ఎక్కువగా యువతనే మోసపోతున్నట్లు తెలుస్తోంది.
మొదట రూ. 5 వేలు, రూ. 10 వేలతో ప్రారంభించి, ఉచ్చులోకి దింపుతున్నారు. పూజలు మధ్యలో ఉన్నాయని, డబ్బు చెల్లించకపోతే అవి ఆగిపోతాయని, అలా చేయడంతో మీకు అరిష్టం అని భయపెడుతా రు. దీంతో నిజమని నమ్మి లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇందు లో మోసపోయిన కొందరు పోలీసులను సంప్రదిస్తున్నారు. ఇటీవల రాచకొండ పరిధిలో ఒక విద్యార్థినికి ఇన్‌స్టాగ్రామ్‌లో మౌలాన అహ్మద్ అలీ పేరుతో జాతకానికి సంబంధించిన ప్రకటన కనబడింది.
ఆ ప్రకటన చూసిన ఆమె ఆ బాబాను సంప్రదించింది. నీ జాతకం బాగానే ఉంది.. అయితే కొన్ని అరిష్టాలు వచ్చిపడే ప్రమాదం ఉందని, మీ జా తకం బాగు చేయాలంటే రూ. 2 వేలు చెల్లించాలంటూ గూగుల్ పే నంబర్ ఇచ్చాడు. రూ. 2 వేలు చెల్లించిన తరువాత రూ. 5 వేలు, ఆ తరువాత రూ. 10 వేలు.. ఆ తర్వతా డబ్లులు అడుగుతూ రూ. 2 లక్షలు కాజేశాడు. ఇంకా డబ్బు అడుగుతుండడంతో మోసం అని గుర్తించిన ఆ యువతి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలపై ట్రై పోలీస్ కమిషనరేట్లలో పలు కేసులు నమోదయ్యాయి. ఆన్లైన్లో వచ్చే ప్రకటనలతో మోసపోవద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు.