సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టి తాము భారీ లాభాలు సంపాదిస్తున్నామంటూ వాట్సాప్‌లో పోస్టులు పెట్టి ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగురాలికి సైబర్‌నేరగాళ్లు రూ. 47 లక్షలు బురిడీ కొట్టించారు. నాచారం ప్రాంతంలో నివాసముండే బాధితురాలి ఫోన్ నెంబర్‌ను ‘జైనమ్ మార్కెట్ సర్కిల్ కె117’ అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌నకు యాడ్ చేశారు. అందులో స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే తమకు లాభాలు వచ్చాయంటూ ఒక్కొక్కరూ తమ అభిప్రాయాలు చెబుతూ స్క్రీన్ షాట్స్ షేర్ చేశారు.
ఆ తరువాత ఆ గ్రూప్ అడ్మిన్ అంటూ మినల్ పారిక్ పేరుతో ఒకరు మాట్లాడుతూ తాము రెగ్యులర్‌గా షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ చాలామందికి టిప్స్ ఇస్తుంటామని, తాము చేసే ఐపీఓలతో భారీ లాభాలు ఆర్జిస్తున్నారంటూ నమ్మించాడు. ఇందుకు జైనవీని అనే పేరుతో ఒక అప్లికేషన్ ఉందని, దానిని డౌన్లోడ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని సూచనలు చేశారు. బాధితురాలు అలాగే చేసి మొదట కొంత పెట్టుబడి పెట్టడంతో లాభాలు వచ్చాయి.
మొదట్లో కొన్ని తక్కువ లాభాలు అందులో నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఆ తరువాత బాధితురాలు రూ. 47.22 లక్షల వరకు పెట్టుబడి పెడుతూ వెళ్లింది. స్క్రీన్‌పై కన్పించే లాభాలు విత్ డ్రా చేసుకోవడం కోసం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, కమిషన్, ఐపీఓల కేటాయింపునకు సంబంధించిన బాకీలు చెల్లించాలంటూ ఒకో పేరుతో ఈ డబ్బును వసూలు చేశారు. డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి ఇలా షరతులు విధిస్తూ డబ్బు డిపాజిట్ చేయిస్తుండడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీ