సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): ఆర్టీవో చలాన్ యాప్ పేరుతో వచ్చిన లింక్‌ను క్లిక్ చేసి అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్న ఓ వ్యాపారి సెల్‌ఫోన్‌ను సైబర్‌నేరగాళ్లు హ్యాక్ చేసి.. అతని ఖాతాలో ఉన్న రూ. 1.5 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆటోనగర్‌లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తున్న బాధితుడి ఫోన్ నంబర్‌ను హైదరాబాద్ గూడ్స్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. అందులో ఆర్టీఓ చలాన్ యాప్ పేరుతో ఒక లింక్‌ను పంపించారు.
బాధితుడు.. ఆ లింక్ క్లిక్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేయగానే అతని సెల్‌ఫోన్‌ను సైబర్ నేరస్తులు హ్యాక్‌చేసి సెల్ఫోన్లో ఉన్న డాటాను సేకరించారు. తన ఫోన్‌ను హ్యాక్ చేశారని భావించిన బాధితుడు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫోన్‌చేసి తన కరెంట్ ఖాతాను బ్లాక్ చేయించాడు. అయితే అప్పటికే సైబర్‌నేరగాళ్లు అతడి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను మార్చేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఓటీపీలు జనరేట్ అవుతుండగా వాటిని ఇతర నంబర్లకు ఫార్వర్డ్ చేశారు. ఇలా హెడ్‌డీఎఫ్‌సీ సేవింగ్స్ అకౌంట్ నుంచి రూ.1,50,890 నేరగాళ్లు కాజేశారు. అనంతరం బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.