సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ): పార్ట్‌టైమ్ ఉద్యోగం అంటూ ఒక మహిళకు వచ్చిన వాట్సాప్ మేసేజ్‌కు స్పందించిన బాధితురాలు సైబర్‌నేరగాళ్ల(Cyber cheaters) చేతికి చిక్కి రూ.12 లక్షలు పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సైబర్ నేరగాళ్లు 3ఐ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నుంచి మేసేజ్ చేస్తున్నామని, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశముందని మెసేజ్ చేశారు. దీంతో బాధితురాలు అందులో ఉన్న నెంబర్‌ను కాంటాక్టు అయ్యింది. గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేసి ‘ది పీచ్ డోర్’ అనే పేరుతో రెస్టారెంట్‌ను క్లిక్ చేయాలని, అందులో రివ్యూ రాసి, 5 స్టార్స్ ఇచ్చి పోస్టు చేయాలంటూ ఒక లింక్‌ను పంపించారు.
అలా చేసిన తరువాత స్క్రీన్ షాట్ పంపిస్తే రూ.200 ఇస్తామంటూ ఆ డబ్బులు ఫోన్ పే ద్వారా పంపించారు. ఆ తరువాత రూ.3 వేలు చెల్లించండి, మీకు అదనంగా డబ్బులు వస్తాయంటూ నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు రూ.3 వేలు పంపించడంతో రూ. 3,880 తిరిగి ఆమె ఖాతాలోకి వచ్చాయి. దీంతో బాధితురాలికి వారిపై నమ్మకం కుదిరింది. తరువాత రూ.7 వేలు డిపాజిట్ చేయించుకొని, రూ. 8,400 పంపిస్తామంటూ నమ్మించారు.
అయితే టెక్నికల్ సమస్యలతో ఆ డబ్బు తిరిగి పంపించలేకపోతున్నామని, అయితే మీరు ‘డాటా క్లిక్ 700-బి’ అనే టెలిగ్రామ్ గ్రూప్‌లో ఆమె నెంబర్ యాడ్ చేశారు. యూ కాయిన్ సంస్థకు చెందిన కాయిన్బిట్స్.మై అనే యాప్ లింక్‌ను పంపించి అందులో షేర్స్ పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయంటూ నమ్మించి రూ. 11.92 లక్షలు పెట్టుబడి పెట్టించి ఆమెను మోసం చేశారు. బాధితురాలు ఫిర్యాదుతో సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.