శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 8 : శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి బంగారం పట్టుబడింది. శుక్రవారం కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాస్ అల్ ఖైమా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన మహిళా ప్రయాణికురాలి బ్యాగును కస్టమ్స్ అధికారులు స్కాన్ చేయగా.. బ్యాగులో 368 గ్రాముల బంగారం లభించింది.
పట్టుబడిన బంగారం విలువ రూ. 20.35 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.