హదరాబాద్ : రాను రాను ఆన్లైన్ (Online Fraud) మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఎంతో మంది ఆమాయకులు ఆన్లైన్కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మోసపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ పేమెంట్లు జనాలకు ఎంతఉపయోగపడుతున్నాయో అంత నష్టం కూడా చేస్తున్నాయి. కొరియరొచ్చిందని, ఒకడు, ఏటీఎం కార్డు యాక్టివేట్ చేస్తమని ఇంకోడు, బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని మరొకడు.. ఇలా రకరకాలుగా ఈ సైబర్ నేరగాళ్లు జనాల సొమ్మును దోచుకుంటూనే ఉన్నారు.
రీసెంట్గా ముద్రలోన్ ఇస్తనని కర్రీపాయింట్ నడుపుకునే లక్ష్మమ్మ అనే మహిళను ఓ నీచ్ కమీనేగాడు మోసం చేసిండట పాపం. పశ్చిమగోదావరి జిల్లా తనుకు పాతపోలస్టేషన్కాడ కర్రీపాయింట్ నడుపుకుంటూ పొట్టపోసుకుంటున్న లక్ష్మమ్మకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మేడమ్ మీరు చాలా లక్కి… మీరు ముద్రలోన్కు సెలెక్ట్ అయిండ్రు.. ముద్రలోన్ ద్వారా మీకు 5 లక్షల రూపాయలు మంజూరైనయని ముచ్చట చెప్పిండు. బ్యాంకుకు రావలిసిన అవసరం లేదు, జస్ట్ నేను చెప్పినట్టు చేస్తే గంట సేపట్లో ఐదు లక్షలు ఆన్లైన్ ద్వారా మీ అకౌంట్లో పడతయని ఆశ చూపిండు.
ఈ కేటుగాడి మాయమాటులు నమ్మిన లక్ష్మమ్మ వాడు చెప్పినట్లు చేసింది. ముందు మీ బ్యాంకు అకౌంటు వివరాలు, ఆధార్ కార్డు పంపమన్నాడు(Online Fraud). వెంటనే ఆమె ఆ వివరాలు పంపింది. ఆ తరువాత వాడు తరిగి ఆమెకు ఒక అకౌంట్ నెంబరు పంపిండు. ఐదులక్షలు మీ అకౌంట్ల పడాలంటే మందు మీరు నేను చెప్పిన బ్యాంకు అకౌంట్కు ప్రాసెసింగ్ఫీజు కింద ఐదేవేల రూపాయలు పంపమన్నాడు. సరే ఐదేవేలేగా అని ఆమె వాని అకౌంట్కు పంపింది. అనంతరం ఇంకా పదివేలు, ఇరవై వేలు, ముప్పై ఆరువేలు వేయాలని అడిగాడు… మీరు పంపిన డబ్బుతోపాటు లోన్ అమౌంట్ మొత్తం మీ
అకౌంట్లో పడతయని నమ్మించి టోటల్గా లక్ష్మమ్మ అకౌంట్లో నుంచి రెండున్నర లక్షలు గుంజిండు సైబర్ కేటుగాడు.
చివరకు మోసపోయానని తెలుసుకున్న కరీపాయింట్ లక్ష్మమ్మ పోలీసులను ఆశ్రయించి ఎట్లనన్నచేసి నా డబ్బులు నాకు వచ్చేలా చేయండి సారూ అంటూ ఫిర్యాదు చేసింది. అయ్యో ఎంత పని చేసినవు లక్ష్మమ్మ.. అట్లెట్ల చేస్తివి తల్లీ అంటూ పోలీసులు కేసు రాసుకున్నరు. ఏమో సారు కర్రీపాయింట్ నడుపుకుంటూ రూపాయి రాపాయి కూడబెట్టుకుని తెలువక మోసపోయిన (Online Fraud) న్యాయం చేయుండ్రి సారూ అంటూ చేతులెత్తి పోలీసులకు దండం బెట్టింది కరీపాయింట్ లక్ష్మక్క.