సుల్తాన్‌బజార్, అక్టోబర్ 18:ఎనిమిది నెలలుగా అద్దె బకాయి చెల్లించకపోవడంతో యజమాని విద్యుత్ ఫ్యూజులు తీసుకుపోయాడు. దీంతో శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం అంధకారంలో మగ్గిపోయింది. రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. చేసేది లేక ఉద్యోగులు యజమానిని కలిసి.. త్వరలోనే భవనాన్ని ఖాళీ చేస్తామని, ఇందుకు పేపర్ నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో సదరు భవన యజమాని విద్యుత్ ఫ్యూజులు తిరిగి బిగించడంతో కరెంటు సరఫరా ప్రారంభమైంది. ఈ విషయమై సబ్ రిజిస్ట్రార్-1 శ్రీనివాస్‌ను వివరణ కోరగా, 8 నెలలుగా భవనం అద్దె బకాయి ఉందని, ఇటీవల రెండు నెలల అద్దె 3 లక్షల రూపాయలకు సంబంధించిన బిల్లు మంజూరైందన్నారు.