జవహర్నగర్, మార్చి 12: హకీంపేటలోని నేషన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(నీసా)లో 54వ రైజింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో జవాన్లు చేసిన విన్యాసాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.
ఆటంకాలు వచ్చినప్పుడు దాడులు చేసే క్రమంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులను వారికి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తారో కండ్లకు కట్టినట్లు చూపించారు. అగ్నిమాపక విపత్తు సమయంలో పాటించాల్సిన నియమాలను కమాండర్లు విన్యాసాలు చేసి చూపించారు.