కాచిగూడ,అక్టోబర్ 8 : గుంటూరు రైల్లో ప్రయాణిస్తున్న లా విద్యార్థి ఖరీదైన సెల్‌ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ జిల్లా గద్వాల్ ప్రాంతానికి చెందిన ఆంజనేయులు(36)లా విద్యార్థి. ఈ నెల 4వ తేదీన గద్వాల్ రైల్వేస్టేషన్లో గుంటూరు-కాచిగూడ రైల్లో కుర్చోని కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వస్తున్నాడు.
కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వచ్చిన తరువాత జేబులో చూసేసరికి ఖరీదైన సెల్‌ఫోన్ కన్పించలేదు.
శుక్రవారం కాచిగూడ రైల్వే పోలీసులకు ఆంజనేయులు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ బిజీ ప్రసాద్ తెలిపారు.