Cricket Tournaments | చిక్కడపల్లి, జూన్ 1 : తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ (TSCAD) ఆధ్వర్యంలో బధిరుల కోసం ప్రత్యేక క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు వల్లభనేని ప్రసాద్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీఎస్సీఏడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర అధ్య క్షుడు వల్లభనేని ప్రసాద్, కార్యదర్శి టి చిరంజీవి మాట్లాడుతూ.. హైదరాబాద్లో రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి ఆసియా కప్ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు ఆసక్తి ఉన్న బధిరులు ఇందులో పాల్గొనాలని సూచించారు. సమావేశంలో భాగంగా నూతన సంస్థాగత కార్యవర్గాన్ని నియమించారు.
సంస్థ రాష్ట్ర అధ్యక్షునిగా వల్లభనేని ప్రసాద్, కార్యదర్శిగా చిరంజీవి, ఉపాధ్యక్షుడుగా విజయ ప్రకాష్, జాయింట్ సెక్రటరీగా షకీల్, కోశాధికారిగా ఇమ్రాన్ సహ పలువురు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హియరింగ్ అధినేత చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.