హిమాయత్‌నగర్, డిసెంబర్26: సమసమాజ స్థాపననే సీపీఐ పార్టీ లక్ష్యమని సీపీఐ కార్యవర్గ సభ్యుడు అతుల్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సీపీఐ పార్టీ 97వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం హిమాయత్‌నగర్‌లోని ఎస్ఎన్ రెడ్డి భవన్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు 97 మీటర్ల ఎర్ర జెండాలు, డప్పుల దరువుతో నృత్యాలు చేశారు. హిమాయత్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 97 ఏండ్ల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన సీపీఐ నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, గ్రేటర్ కార్యదర్శి ఈటీ నరసింహ, వీఎస్ బోస్, బాలమల్లేశ్, పశ్యపద్మ, ప్రేంపావని, నర్సింహ, కమతం యాదగిరి, జంగయ్య, ఎన్.శ్రీకాంత్, సాయిలు గౌడ్, సృజన, ఎన్.జ్యోతి, అనిల్‌కుమార్, శివరామకృష్ణ, సక్రిబాయి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.