సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటాకుల దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని సీపీ సజ్జనార్ తెలిపారు. పటాకులు విక్రయించడానికి ఏర్పాటుచేసే తాత్కాలిక దుకాణాలకు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలంటూ నోటిఫికేషన్ జారీ చేశారు.
ప్రతి దుకాణ దారుడు పేలుడు చట్టం 1884, పేలుడు నియమాలు 1983(2008లో సవరించబడిన చట్టం) కింద లైసెన్స్ తీసుకోవాలని పోలీసులు ఆదేశించారు. లైసెన్స్‌లను పోలీసు శాఖకు చెందిన జోనల్ డిప్యూటీ కమిషనర్లు జారీ చేస్తారని, అక్టోబర్ 15లోగా దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.